బాలయ్య అభిమానులకు శుభవార్త
నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సి.కల్యాణ్ నిర్మిస్తున్న చిత్రం గురువారం లాంఛనంగా మొదలైంది. సి.కె.ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో ఈ చిత్రం రూపొందుతోంది. హ్యాపీ మూవీస్ పతాకంపై తెరకెక్కుతోంది. జై సింహా తర్వాత ఈ కాంబినేషన్లో వస్తోన్న చిత్రమిదే. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు వి.వి.వినాయక్ క్లాప్‌కొట్టారు. బోయపాటి శ్రీను కెమెరా స్విచ్ఛాన్ చేశారు. కోదండరామిరెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. జులై నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని, ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని సి.కల్యాణ్ చెప్పారు. ఈ చిత్రానికి పరుచూరి మురళి కథ అందించారు. చిరంతన్ భట్ స్వరాలు సమకూరుస్తున్నారు. కెమెరా:రామ్‌ప్రసాద్, యాక్షన్: రామ్-లక్ష్మణ్, ఆర్ట్: చిన్నా, మాటలు: రత్నం, సహ నిర్మాత: సి.వి.రావు.













