నిర్మాతల, ప్రజల సేఫ్టీ కోసం షూటింగ్ లొకేషన్ మార్చిన నందమూరి బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ బాలకృష్ణ- గోపీచంద్ మలినేని మాస్ కలయికలో రాబోతున్న చిత్రానికి సంబంధించి బాలయ్య ఫ్యాన్స్ హుషారెత్తే అప్డేట్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపిస్తారట. ఇటీవలే ‘అఖండ’ రూపంలో సూపర్ సక్సెస్ అందుకున్న నందమూరి బాలకృష్ణ..అదే జోష్‌లో వరుస సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాకు కమిటైన ఆయన మరో మాస్ జాతరకు రెడీ అయ్యారు. రీసెంట్గా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ తెలంగాణ లోని సిరిసిల్లలో ప్రారంభించారు. అసలు విషయం ఏమిటంటే ఈ షెడ్యూల్ మార్చ్ 3నుండి అహోబిలం టెంపుల్ లో జరపడానికి ప్లాన్ చేసుకున్నారు. అయితే ఈ విషయం తెలిసిన బాలయ్య అభిమానులు అహోబిలం టెంపుల్ దర్శనానికి ఆన్లైన్ లో 20 వేలకు పైగా టికెట్స్ బుక్ చేసారని తెలిసింది. అంతమంది జనాల మధ్యలో షూటింగ్ జరపడం సాధ్యం కాదు, పైగా పోలీస్ పర్మిషన్స్ కోవిడ్ ఆంక్షలు ఉంటాయి కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో సిరిసిల్లలోని మారు మూల ప్రదేశం లో షూటింగ్ ప్రారంభించారు. అంతేకాకుండా తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ వైరల్ అవుతోంది. రాయలసీమ నేపథ్యంలో ఈ సినిమా కథ ఉండబోతోందని, ఇందులో బాలయ్య బాబు రెండు డిఫరెంట్ వేరియేషన్స్‌లో కనిపించబోతున్నారని అంటున్నారు.
బాలయ్య చేస్తున్న డ్యూయల్ రోల్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తుందని, రెండు కూడా మాస్ క్యారెక్టర్స్ అనే టాక్ వినిపిస్తోంది. కాగా, NBK #107 అంటూ సినిమా పేరు ప్రకటించకుండా ఇటీవలే ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలారు మేకర్స్. ఇందులో బాలకృష్ణ పవర్ఫుల్ లుక్ నందమూరి అభిమానులకు కిక్కిచ్చింది. బ్లాక్ లుంగీతో మాస్ ట్రీట్ ఇచ్చారు బాలయ్య బాబు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ రేంజ్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. బాలయ్యను ఢీ కొట్టే విలన్ పాత్రలో కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తుండగా.. మరో లేడీ పవర్ ఫుల్ పాత్రను వరలక్ష్మీ శరత్ కుమార్ పోషిస్తోంది. నిజ జీవిత సంఘటనలతో మాస్ ఆడియన్స్‌కి పిచ్చెక్కిపోయే సన్నివేశాలతో ఈ సినిమా రూపొందుతోందని టాక్. బాలకృష్ణ- గోపీచంద్ మలినేని మాస్ కలయిక కావడంతో ఈ మూవీపై ఓ రేంజ్ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు బాలయ్యది డ్యూయల్ రోల్ అని తెలుస్తుండటం మరింత ఆసక్తికరంగా మారింది.













