అఖండ విషయంలో బోయపాటిపై ఫ్యాన్స్ ఫైర్..
నటసింహ నందమూరి బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు అఖండ అనే పవర్ ఫుల్ టైటిల్ ని ఖారారు చేశారు. ఉగాది సందర్భంగా ఆ సినిమా పేరుని ప్రకటించడంతో టీజర్ ని కూడా రిలీజ్ చేశారు. మునుపెన్నడూ చూడని విధంగా బాలయ్య అఘోరా గెటప్ లో కనిపించి ఆడియన్స్ ను సర్ ప్రైజ్ చేశాడు.
కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది.. కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది అంటూ ఆయన చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది. ఈ టీజర్ ఇప్పటికే దాదాపు 13 మిలియన్ల వ్యూస్ తో యూ ట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. బాలయ్యను ఈ అవతారంలో చూపించిన బోయపాటిని మెచ్చుకుంటున్న ఫ్యాన్స్, టైటిల్ విషయంలో మాత్రం చాలా కోపంగా ఉన్నారనిపిస్తుంది. టీజర్ వరకు అయితే ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంటే, టైటిల్ విషయంలోనే చాలా నిరాశగా ఉన్నారని తెలుస్తుంది.
ఎందుకో అఖండ అనే టైటిల్ బాలయ్య ఫ్యాన్స్ కు పెద్దగా ఎక్కట్లేదట. దీనికి బదులు మొన్నటి వరకు బీబీ3 టైటిల్స్ గా ప్రచారంలో ఉన్న మోనార్క్ అనే టైటిల్ అయితే బావుండేదని వారు అభిప్రాయపడుతున్నట్లు టాక్ నడుస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్ లు బ్లాక్ బస్టర్లుగా నిలవడంతో ఇప్పుడు అఖండ మీద చాలానే అంచనాలున్నాయి. బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్ నటిస్తుంటే, పూర్ణ కీలకపాత్రలో కనిపించనుంది. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంటే, ఎస్. ఎస్ థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. మే 28న అఖండ ప్రేక్షకుల ముందుకు రానుంది.













