Akhanda2: అఖండ2లో బాలయ్య లుక్‌పై ఇంట్రెస్టింగ్ అప్డేట్
వరుస హిట్లతో ఫుల్ జోష్ లో ఉన్న బాలకృష్ణ(Balakrishna) రీసెంట్ గా డాకు మహారాజ్(Daku maharaj) సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బోయపాటి శీను(Boyapati Srinu) దర్శకత్వంలో బాలయ్య అఖండ2 తాండవం(AKhanda2 thandavam) చేస్తున్నాడు. బ్లాక్ బస్టర్ అయిన అఖండ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రూపొందుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.
బాలయ్య(Balayya) రీసెంట్ గా అఖండ2 సెట్స్ లో జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం రామోజీఫిల్మ్ సిటీలో స్పెషల్ గా వేసిన సెట్స్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. బాలయ్య అఘోరా గెటప్ పై సన్నివేశాలను షూట్ చేస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలయ్య లుక్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది.
అఖండలో బాలయ్య కనిపించే లుక్ కంటే ఈ సినిమాలో లుక్ ను బోయపాటి పవర్ఫుల్ గా డిజైన్ చేశాడని, ఈ కొత్త లుక్ అందరినీ ఆశ్చర్యపరుస్తుందని అంటున్నారు. ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal), సంయుక్తా మీనన్(Samyuktha Menon) నటిస్తున్న అఖండ2 తాండవంకు తమన్(Thaman) సంగీతం అందించనున్నాడు. సెప్టెంబర్ 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.













