118 ప్రీ రిలీజ్ కు నటసింహం, యంగ్ టైగర్
నందమూరి కళ్యాణ్‌రామ్ నటించిన తాజా చిత్రం 118. సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. విడుదలకు సిద్దమైంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యుబైఎ సర్టిఫికెట్ అందించింది. ఇక ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్‌లోని జెఆర్సీ కన్వెన్షన్‌లో జరగనుంది. ముఖ్య అతిథులుగా నందమూరి బాలకృష్ణ, యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హాజరుకానున్నారు. కెవి గుహన్ తెరకెక్కించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌లో నివేధ థామస్, శాలినీపాండే హీరోయిన్లుగా నటించారు. శేఖర్ చంద్ర సంగీతం అందించారు. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 1న విడుదల కానుంది.













