విశ్వక్ కోసం రానున్న నట సింహం
విశ్వక్ సేన్ హీరోగా గోదావరి బ్యాక్ డ్రాప్ లో చేస్తున్న సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాలో విశ్వక్ పక్కా గోదావరి యువకుడిగా, మాస్ లీడర్ గా కనిపించనున్నాడు.
ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కచ్ఛితంగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విశ్వక్ కెరీర్లో మంచి సినిమాగా మిగులుతుందని అందరూ భావిస్తున్నారు. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. అందులో భాగంగానే మే 28న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు మేకర్స్.
ఈ ఈవెంట్ కు నందమూరి బాలకృష్ణ చీఫ్ గెస్టుగా రానున్నాడని విశ్వక్సేన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఇన్‌డైరెక్ట్ గా హింట్ ఇచ్చాడు. ప్రస్తుతం బాలయ్య సితార సంస్థలో బాబీతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దానికి తోడు విశ్వక్ అంటే బాలయ్యకు ప్రత్యేకమైన అభిమానముండటంతో ఈవెంట్ కు పిలవగానే బాలయ్య వస్తానని మాటిచ్చినట్లు తెలుస్తోంది. బాలయ్య ఈ ఈవెంట్ కు వస్తే సినిమాకు ఉన్న బజ్ పెరగడంతో పాటూ బాలయ్య అభిమానుల సపోర్ట్ కూడా ఈ సినిమాకు దక్కుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా, అంజలి కీలక పాత్రలో కనిపించనుంది.













