సెన్సార్‌బోర్డు ప్రాంతీయ అధికారిగా బాలకృష్ణ
సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సెన్సార్ బోర్డ్) ప్రాంతీయ అధికారిగా వీ బాలకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అధికారయిన ఆయన ఇప్పటివరకు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖలో క్షేత్ర ప్రచార అధికారిగా, యోజన తెలుగు మాసనత్రిక ఎడిటర్‌గా, ఆలిండియా రేడియో న్యూస్ ఎడిటర్‌గా, పత్రికా సమాచార కార్యాయలంలో డిప్యూటీ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఇద్దరు ఉపరాష్ట్రపతుల వద్ద సమాచార అధికారిగా పనిచేసి బదిలీపై హైదరాబాద్ సెన్సార్‌బోర్డు ప్రాంతీయ అధికారిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇకనుంంచి ఎలాంటి జాప్యం లేకుండా సెన్సార్ ధ్రువీకరణ పత్రాలను జారీ చేస్తామని తెలిపారు.













