సూపర్ స్టార్ ను ఆహ్వానించిన బాలయ్య
నందమూరి తారక రామారావు జీవితాధారంగా తెరకెక్కిన చిత్రం యన్‌టిఆర్. ఈ చిత్ర ఆడియో లాంచ్ వేడుకను ఈ రోజు అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఇదే వేడుకలో ట్రైలర్‌ను కూడా విడుదల చేయనున్నారు. అయితే ఈ వేడుకకు సూపర్‌స్టార్ కృష్ణ అతిథిగా విచ్చేయనున్నారు. బాలకృష్ణ స్వయంగా కృష్ణ నివాసానికి వెళ్లి మరీ ఆయన్ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా నరేశ్, కృష్ణ, బాలకృష్ణ కలిసి దిగిన ఫొటోలను చిత్రబృందం ట్విటర్ వేదికగా పంచుకుంది. ఈ సందర్భంగా యన్టీఆర్ సినిమాలో బాలకృష్ణ తండ్రి పాత్ర కోసం వేసిన గెటప్స్ తనకు నచ్చాయని కృష్ణ మెచ్చుకున్నారట. ఈ చిత్రం తెలుగు సినీ పరిశ్రమలో మైలురాయిలా నిలిచిపోతుందని కొనియాడారని, చిత్రబృందానికి విషెస్ తెలిపారని సినీ వర్గాలు తెలిపాయి.













