తెలుగు పింక్‌లో బాలయ్య ?
బాలకృష్ణ తొలిసారి రీమేక్‌లో నటించేందుకు సిద్ధమవుతున్నారు. బాలీవుడ్లో ఘన విజయం సాధించిన పింక్ రీమేక్‌లో నటించబోతున్నట్టు సమాచారం. కోర్ట్ రూమ్ డ్రామాగా మహిళలపై లైంగిక వేధింపుల నేపథ్యంలో అమితాబ్ బచ్చన్, తాప్సీ ప్రధాన పాత్రధారులుగా అనిరుద్ధా రాయ్, చౌదరి సంయుక్తంగా దర్శకత్వంలో రూపొందిన చిత్రం పింక్. మూడేండ్ల క్రితం విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల విశేష ఆదరణతో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. సామాజిక అంశాలను చర్చించిన చిత్రంగానూ జాతీయ అవార్డునందుకుంది. ఈ సినిమాని ఇప్పటికే తమిళంలో అజిత్ హీరోగా రీమేక్ చేశారు. విద్యాబాలన్, శ్రద్దా శ్రీనాథ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా విడుదలై ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో తెలుగులో బాలకృష్ణ హీరోగా దీన్ని రీమేక్ చేసేందుకు దిల్‌రాజు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.













