అఖండ2 కు రేటు పెంచిన బాలయ్య
హ్యాట్రిక్ హిట్స్ తో దూసుకెళ్తున్న నందమూరి బాలకృష్ణ(Nandamuri Bala Krishna) ప్రస్తుతం బాబీ(Bobby) దర్శకత్వంలో తన 109వ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీని తర్వాతి సినిమాను బాలయ్య(Balaiah), బోయపాటి శ్రీను(Boyapati Srinu) దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే వీరి కాంబోలో సింహా(Simha), లెజెండ్(Legend), అఖండ(Akhanda) సినిమాలొచ్చి మంచి హిట్స్ అయ్యాయి. అఖండ భారీ విజయం సాధించడంతో ఆ సినిమాకు సీక్వెల్ ను చేయడానికి బాలయ్య- బోయపాటి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన స్క్రిప్ట్ ను బోయపాటి రెడీ చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలయ్య లుక్ కోసం 3డి డిజైన్లు కూడా రెడీ చేయిస్తున్నాడు బోయపాటి.
ఇదిలా ఉంటే అఖండ2(Akhanda2) కోసం బాలయ్య తన కెరీర్లోనే హయ్యెస్ట్ రెమ్యూనరేషన్(Remuneration) ను తీసుకోబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటివరకు బాలయ్య పారితోషికం రూ.20 కోట్లుగా ఉంది. ఇది టాలీవుడ్ లో చాలా మంది యంగ్ హీరోల రెమ్యూనరేషన్ కంటే తక్కువ. తన ఖాతాలో వరుస హిట్లు పడటంతో బాలయ్య ఇప్పుడు ఒకేసారి తన రెమ్యూనరేషన్ ను రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్లకు పెంచినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కూడా బాలయ్య రెండు పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం.













