బాలయ్య హ్యాట్రిక్ కొట్టేసినట్లే!
దసరాకు రిలీజైన లియో, భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావులో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న సినిమా భగవంత్ కేసరినే. రిలీజ్ కు ముందు పెద్దగా హైప్ లేని ఈ సినిమా, రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లతో దూసుకెళ్తుంది. మొదటి రోజు ఓ మోస్తరు కలెక్షన్స్ తెచ్చుకున్న భగవంత్ కేసరికి రెండో రోజు ఇంకా తక్కువ కలెక్షన్స్ వచ్చాయి.
దీంతో భగవంత్ కేసరి ఫైనల్ గా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో అన్న అనుమానాలొచ్చాయి. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ భగవంత్ కేసరి మంచి కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది. దసరా సెలవులు ఈ సినిమాకు బాగా ఉపయోగపడ్డాయి. పండగ తర్వాత కూడా ఈ సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నాయి.
ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూన.80 కోట్ల గ్రాస్, రూ.50 కోట్లకు పైగా షేర్ రాబట్టిన భగవంత్ కేసరి మరో వారం రోజుల పాటూ సత్తా చాటడం ఖాయం. అంటే ఈ వారంలో ఎంత లేదన్నా మరో పది కోట్లు కలెక్ట్ చేస్తుంది. దీన్ని బట్టి చూస్తే బాలయ్య కమర్షియల్ గా మరో సారి హిట్టు కొట్టినట్లే. అంటే భగవంత్ కేసరితో బాలయ్య హ్యాట్రిక్ కొట్టాడన్నమాట.













