Jailer2: జైలర్2లో క్రేజీ గెస్ట్ రోల్
కొన్ని కాంబినేషన్ల కోసం ఆడియన్స్ ఎంతగానో వెయిట్ చేస్తుంటారు. అందుకే మల్టీస్టారర్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. రజనీకాంత్(Rajinikanth) కంబ్యాక్ సినిమాగా నిలిచిన జైలర్(Jailer) కు సీక్వెల్ గా రీసెంట్ గా జైలర్2(Jailer2) ను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇంకా షూటింగ్ మొదలవకుండానే జైలర్2 పై అంచనాలు తారా స్థాయికి చేరుతున్నాయి.
ముత్తువేల్ పాండియన్ ఈసారి ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక అసలు విషయానికొస్తే జైలర్2 లో నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) స్పెషల్ రోల్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని ఇన్సైడ్ టాక్. ఫస్ట్ పార్ట్ లో కన్నడ నుంచి శివరాజ్ కుమార్(Sivaraj Kumar), మలయాళం నుంచి మోహన్ లాల్(Mohan lal) ని భాగం చేసిన డైరెక్టర్ నెల్సన్(Nelson) తెలుగు నుంచి మాత్రం ఎవరినీ భాగం చేయలేదు.
ఫస్ట్ పార్ట్ లో తెలుగు నుంచి బాలయ్యను ఓ పోలీసాఫీసర్ పాత్రలో పవర్ఫుల్ గా అనుకున్నట్లు కానీ కుదరలేదని డైరెక్టర్ గతంలో తెలిపాడు. అయితే ఇప్పుడది కార్యరూపం దాలుస్తున్నట్టు కోలీవుడ్ వర్గాల టాక్. అసలే బాలయ్య, రజినీ మధ్య మంచి అనుబంధం ఉంది. ఒకవేళ నిజమైతే మాత్రం బ్లాస్ట్ మామూలుగా ఉండదు.













