పీరియాడికల్ మూవీ గా బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబో చిత్రం?
టాలీవుడ్ లో సరికొత్త వేషధారణతో నటనకు స్కోప్ వున్నా కురిపి ప్రాత్రలైనా సరే ఎప్పటికప్పుడు ముందుండే నందమూరి బాలకృష్ణ నెక్స్ట్ సినిమా గురించిన ఓ ఆసక్తికర అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరోసారి వెండితెరపై బాలయ్య విశ్వరూపం చూపించేలా డైరెక్టర్ గోపీచంద్ మలినేని ప్లాన్ చేశారట. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ మూవీ చేస్తున్న నందమూరి నటసింహం బాలకృష్ణ, వరుస సినిమాలను లైన్లో పెడుతున్నారు. మాస్ ఆడియన్స్ చేత గోల పెట్టించడమే టార్గెట్‌గా యమ స్పీడుగా అడుగులేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన తదుపరి సినిమాను ‘క్రాక్’ దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఫిక్స్ చేసుకున్నారు బాలయ్య బాబు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా అతిత్వరలో ప్రారంభం కానుందని మైత్రిమూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ పేర్కొనడంతో సినీ వర్గాల్లో ఈ సినిమా గురించిన చర్చలు మొదలయ్యాయి. ఇందులో బాలయ్య సరసన ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్నారని, ప్రస్తుతం వారిని ఎంపిక చేసే పనిలో డైరెక్టర్ ఉన్నారని అంటున్నారు. అలాగే, మిగిలిన నటీనటుల గురించి కూడా పలువురి పేర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. నిజ జీవిత సంఘటనలతో మాస్ ఆడియన్స్‌కి పిచ్చెక్కిపోయే సన్నివేశాలతో ఈ సినిమా రూపొందించాలని గోపీచంద్ ప్లాన్ చేస్తున్నారట. ఇందులో భాగంగానే ఈ మూవీ కోసం ప్రకాశం జిల్లా, వేటపాలెంకు సంబంధించిన వార్తా పత్రికలను వందేళ్ల కాలం నుంచి తిరగేసి మరీ దర్శకుడు కథను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో బాలకృష్ణ మాస్ పోలీస్ ఆఫీసర్‌గా, ఫ్యాక్షనిస్ట్‌గా రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని టాక్. అతిత్వరలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. అఖండ బాలయ్య మాస్ గెటప్ పాటు అయితే సరికొత్త గెట్ అప్ తో మాస్ ఆడియన్స్ ఆకట్టుకోడానికి పీరియాడికల్ మూవీకి సన్నాహాలు చేస్తున్నాడు దర్శకుడు గోపీచంద్ మలినేని.













