అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న నందమూరి ఫ్యాన్స్
భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమా తర్వాత నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), బాబీ(Bobby Kolli) దర్శకత్వంలో చేస్తున్న సినిమా ఎన్బీకే109(NBK109). ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. వాల్తేరు వీరయ్య(Valtair Veerayya) తర్వాత బాబీ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో మొదటినుంచి ఈ మూవీపై మంచి హైప్ నెలకొంది. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా టైటిల్ ను మేకర్స్ ఇంకా రివీల్ చేయలేదు.
ఇప్పటికే ఈ సినిమా టైటిల్, అప్డేట్స్ విషయంలో నందమూరి ఫ్యాన్స్ కొంత నిరాశ చెందారు. ఫస్ట్ లుక్, పోస్టర్ లాంటి మినిమం అప్డేట్స్ కూడా ఈ సినిమా నుంచి రాకపోవడంతో ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే మేకర్స్ రీసెంట్ గా ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేయాలనుకుని ప్లాన్ చేసినప్పటికీ కొన్ని కారణాల వల్ల కుదరలేదని సమాచారం.
ఇప్పుడు దసరా వస్తున్న సందర్భంగా మేకర్స్ ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేసే ఛాన్సుందని మీడియా వర్గాల్లో రూమర్లు వినిపిస్తున్నాయి. దీంతో బాలయ్య109 టైటిల్ పై మరింత సస్పెన్స్ కొనసాగుతుంది. టైటిల్ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే అనౌన్స్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నారట. ఇదిలా ఉంటే ఫ్యాన్స్ మాత్రం టైటిల్ తో పాటూ రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేసి ఫ్యాన్స్ కు క్లారిటీ ఇవ్వాలని ఆశపడుతున్నారు. తమన్(Thaman) సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara Entertainments) సంస్థ నిర్మిస్తోంది.













