బాలకృష్ణ, రాజశేఖర్ కలయిక కుదిరేనా?
తమిళంలో విజయవంతమైన విక్రమ్ వేద చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనే ప్రయత్నాలు ఎప్పట్నుంచో జరుగుతున్నాయి. మాధవన్, విజయ్ సేతుపతి కలిసి నటించిన ఆ సినిమా రీమేక్ కోసం ఇద్దరు అగ్ర కథా నాయకులు పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. కానీ కార్యరూపం దాల్చలేదు. తాజాగా ఆ చిత్రాన్ని బాలకృష్ణ, రాజశేఖర్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కించాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. బాలకృష్ణ తదుపరి బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారు. రాజశేఖర్ కల్కి తో బిజీగా ఉన్నారు. ఎన్నికల తర్వాతే ఈ కలయికలో సినిమా గురించి ఓ సృష్టత వచ్చే అవకాశం ఉంది.













