సిక్కోలు తుపాను బాధితులకు బాలయ్య రూ.25 లక్షల ఆర్థిక సాయం
హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి మంచి మనసు చాటుకున్నాడు. తిత్లీ తుపానుతో కోలుకోని దెబ్బతిన్న సిక్కోలును ఆదుకునేందుకు ఆయన ముందుకొచ్చారు. రూ.25 లక్షల ఆర్థిక సాయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహాయనిధికి పంపుతున్నట్లు తెలిపారు. తుపాను తీవ్రతతో కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు సినీ ఇండస్ట్రీ నుంచి ఇప్పటికే కార్తీకేయ, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, వరుణ్ తేజ్, నిఖిల్, సంపూర్ణేష్ బాబు, విజయ్ దేవరకొండ ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా బాలకృష్ణ ఆర్థిక సాయం ప్రకటించడం విశేషం. తిత్లీ తుపాను ధాటికి అతలాకుతలమైన ఉత్తరాంధ్ర వాసులకు అండగా, సాయం చేసేందుకు తాము సైతం అంటూ తెలుగు హీరోలు ముందుకొస్తున్నారు.













