ENErepeat: క్రేజీ సీక్వెల్ లో టాలీవుడ్ సీనియర్ హీరో క్యామియో

ఈ నగరానికి ఏమైంది(ee nagaraniki emaindhi) సినిమాకు యూత్ లో ఫాలోయింగే వేరు. మొన్నామధ్య ఈ సినిమాను రీరిలీజ్ చేయగా మంచి కలెక్షన్లను అందుకుంది. ఈ సినిమా సీక్వెల్ కోసం టాలీవుడ్ యూత్ ఎప్పట్నుంచో వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వారి ఆశలు ఫలించాయి. ఈ నగరానికి ఏమైంది సినిమాకు సీక్వెల్ గా ఈఎన్ఈ రిపీట్ అంటూ డైరెక్టర్ తరుణ్ భాస్కర్(tharun bhascker) రీసెంట్ గానే అనౌన్స్ చేశాడు.
అనౌన్స్‌మెంట్ తోనే ఈ సీక్వెల్ పై మంచి బజ్ క్రియేట్ అవగా, ఇప్పుడు ఈ ప్రాజెక్టుపై ఓ క్రేజీ బజ్ వినిపిస్తోంది. ఈ నగరానికి ఏమైంది2లో నందమూరి నటసింహ బాలకృష్ణ(Nandamuri Balakrishna) ఓ ఇంట్రెస్టింగ్ క్యామియో చేస్తున్నట్లు తెలుస్తోంది. విశ్వక్ సేన్(viswak sen) తో కలిసి ఓ క్రేజీ ఎపిసోడ్ కోసం బాలయ్య(Balayya) ఈ సినిమాలో కొన్ని నిమిషాల పాటూ స్క్రీన్ పై కనిపించి ఆడియన్స్ ను అలరించనున్నట్టు తెలుస్తోంది.
ఈ వార్తల్లో నిజమెంతన్నది పక్కన పెడితే ఒక వేళ ఇదే జరిగి నిజమైతే ఈఎన్ఈ2(ENE2) థియేటర్లలో బ్లాస్ట్ అవడం ఖాయం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. కాగా ఈ సీక్వెల్ స్క్రిప్ట్ పై తరుణ్ భాస్కర్ ఎంతో కాలంగా వర్క్ చేసి చాలా పకడ్బందీగా రాసుకున్నట్టు తెలుస్తోంది. మొదటి పార్ట్ లో నటించిన వారే ఈ సీక్వెల్ లో కూడా భాగం కానున్నారు.