బాలకృష్ణ, బోయపాటి చిత్రానికి పవర్ ఫుల్ టైటిల్!
నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో #BB3 అని వర్కింగ్ టైటిల్ తో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన చాలా టైటిల్స్ సోషల్ మీడియా ద్వారా వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఓ టైటిల్ ఖరారు చేశారని సమాచారం. అసలు విషయంలోకి వెళితే.. మాస్ మసాలా సినిమాల డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్, బాలకృష్ణ కాంబినేషన్ లో గతం లో వచ్చిన పవెర్ ఫుల్ టైటిల్స్ కి భిన్నంగా ఈ చిత్రానికి పెట్టారని తెలుస్తోంది. మొదటగా “మోనార్క్” అనే టైటిల్ ఆల్ మోస్ట్ కన్ఫాం చేసినప్పటికీ అంతకు ముందు వచ్చిన నేను మోనార్క్ ని చిత్రం అట్టర్ ప్లాప్ అయ్యింది. మళ్ళీ ఎందుకనో ఆ టైటిల్ కి నో చెప్పి మహా నటుడు యన్ టి ఆర్ చేసిన “సూపర్ మ్యాన్” అనే టైటిల్ ని అనుకున్నారని టాక్ వచ్చింది. ఆ చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. మరో సారి ఈ సినిమా కి “వారియర్” అనే టైటిల్ కూడా అనుకున్నారని వార్తలు రాగా ఇప్పుడు లేటెస్ట్ గా సరి కొత్త టైటిల్ కూడా వినిపిస్తుంది. ఈ సారి టైటిల్ “డేంజర్” అని అంటున్నారు. అది కూడా హర్రర్ మూవీ టైటిల్ లా ఉందని వదిలేసారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు అవేమి కాకుండా “ఉగ్ర నరసింహా”, లేదా “విధ్వంసం” అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
మొదట విన్న టైటిల్స్ కంటే ఇవే పవర్ ఫుల్ గానూ బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ కు సరిగ్గా సరిపోతుందని అనుకున్నారట మూవీ యూనిట్. అందరు కూడా ఈ టైటిల్స్ కే మొగ్గు చూపారని.. ఈ రెండింటిలో ఒకటి ఖరారు చేస్తారని సమాచారం. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వచ్చిన “సింహా”, “లెజెండ్” వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తరహా టైటిల్ ఇదేనంటూ మెచ్చుకున్నారని తెలుస్తోంది. కానీ ఇందులో ఏది ఫైనల్ అన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉండగా ఇంకా సమయం ఉన్న నేపధ్యంలో మరిన్ని టైటిల్స్ ని గమనించి మొదటి సినిమాలకు ఏమాత్రం తగ్గని టైటిల్ ని ఎంచుకోవాలి అని టీం భావిస్తుందట.













