బాలయ్య ఫ్యాన్స్‌కు ఈ సారి మంచి ట్రీట్
అఖండ, వీర సింహారెడ్డి సినిమాల వరుస సక్సెస్‌తో ఫుల్ జోష్ లో ఉన్న బాలకృష్ణ, తన తర్వాతి సినిమాను అనిల్ రావిపూడితో చేస్తున్నాడు. ఈ సినిమా బాలయ్య కెరీర్లో 108వ సినిమాగా తెరకెక్కుతుంది. ఇదిలా ఉంటే జూన్ 10న బాలయ్య బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కు ట్రిపుల్ ట్రీట్ రాబోతుంది. అందులో భాగంగా మొదటిది అనిల్ రావిపూడి సినిమా టైటిల్ తో పాటూ చిన్న వీడియో గ్లింప్స్.
ఈ సినిమాలో బాలయ్య డిఫరెంట్ గెటప్ లో కనిపించనున్నాడు. బాలయ్యను అనిల్ రావిపూడి ఎంతో స్పెషల్ గా ప్రెజెంట్ చేయనున్నాడట. భగవంత్ కేసరి అనే టైటిల్‌తో ఐ డోంట్ కేర్ అనే ట్యాగ్ లైన్ ఇప్పటికే ఈ సినిమాకు లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే రెండోది నరసింహ నాయుడు రీరిలీజ్. 2001లో రిలీజై ఇండస్ట్రీ హిట్ అందుకున్న ఈ సినిమాను బిగ్ స్క్రీన్ పై చూడని ఎంతో మంది ఫ్యాన్స్ కు ఇది మంచి ట్రీట్ అనే చెప్పాలి.
బి.గోపాల్ డైరెక్షన్ లో వచ్చిన ఈ ఫ్యాక్షన్ మూవీకి మణిశర్మ సంగీతం, బాలయ్య పవర్ఫుల్ యాక్టింగ్.. అప్పట్లో ఈ సినిమాతో పాటూ రిలీజ్ అయిన మిగిలిన సినిమాలను దాటి ఈ సినిమా నెంబర్ వన్ ప్లేస్ ను దక్కించుకోవడానికి కారణమయ్యాయి. ఈ సినిమాను ఇప్పుడు 4కె లో రిలీజ్ చేయబోతున్నారు. ఇక మూడోది భైరవ ద్వీపం సినిమా. సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్ లో వచ్చిన ఈ జానపద సినిమా ఓ రేంజ్ లో ఆడింది.
ఈ సినిమాను బిగ్ స్క్రీన్ పై చూడటం అనేది ఓ గొప్ప అనుభూతనే చెప్పాలి. వీటితో పాటూ బాలయ్య తర్వాతి సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా ఆ రోజునే రాబోతున్నాయి. మొత్తానికి బాలయ్య బర్త్ డే కు ఈసారి ఫ్యాన్స్ కు మంచి ట్రీటే ఇస్తున్నాడని చెప్పాలి.













