నందమూరి అభిమానులకు బాలయ్య బర్త్ డే గిఫ్ట్

నందమూరి నట వారసుడు నట సింహ నందమూరి బాలకృష్ణ బాలనటుడిగా 1974లో తెరంగ్రేట్రం చేసి ఇప్పటిదాకా అవిశ్రాంతంగా 47 ఏళ్ళుగా నటిస్తున్న ఏకైక నట వారసుడు ప్రపంచ సినీ చరిత్రలో ఎవరు లేరు. హీరోగా ఇప్పటికి 105 సినిమాలు చేసారు. త్వరలో 106 సినిమా ‘అఖండ’తో పలకరించనున్నారు. ఇక టాలీవుడ్లో జానపద, పౌరాణిక, సాంఘిక, చారిత్రాత్మక చిత్రాల్లో నటించిన ఏకైక నటుడు కూడా బాలయ్యే. బాలకృష్ణ కత్తి పట్టినా.. డైలాగ్ చెప్పినా.. తొడగొట్టినా..థియేటర్ దద్దారిలాల్సిందే. ఆ కంటి చూపు చాలు… రికార్డులు కొత్త దారులు వెతుక్కొంటాయి. దశాబ్దాలుగా… కమర్షియల్ సినిమాకి కేరాఫ్ అడ్రస్ అతనే. ట్రెండు ఎప్పుడూ ఆయన్నుంచే టర్న్ తీసుకొంటుంది. ‘నారీ నారీ నడుమ మురారి’ తరవాత అత్త కథలకు కొత్త రెక్కలొచ్చాయి. ‘భైరవద్వీపం’ చూసి కత్తి పట్టినవాళ్లున్నారు. ‘పెద్దన్నయ్య’ వచ్చాక… తలకు తెలుగు రంగుపూసి అన్నయ్యలుగా మారిన హీరోలున్నారు. ‘సమరసింహారెడ్డి’ తర్వాత ఫ్యాక్షన్ కథల వైపు పరుగులు పెట్టినవారున్నారు.విషయానికి కొస్తే.. నందమూరి బాలకృష్ణ సీనియర్లలో టాప్ హీరో. అలాగే తెలుగులో నటవారసుల్లో టాప్ హీరో అనిపించుకున్న తొలి కథానాయికుడు. అంతేకాదు గత పుట్టినరోజు నుంచి ఈ పుట్టినరోజు వరకు బాలయ్య నటించిన ఏ సినిమా విడుదల కాలేదు.
అయితే అసలు విషయానికొస్తే…. నందమూరి బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా రేపు ఉదయం అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ రెడీ చేసారు మైత్రీ మూవీ మేకర్స్. ప్రస్తుతం బాలయ్య.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఈ గురువారం (జూన్ 10) బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఓ పోస్టర్‌ను విడుదల చేసారు. ఇపుడు మైత్రీ మూవీ మేకర్స్, గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి నట సింహా బాలకృష్ణ హీరోగా ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ గురువారం బర్త్ డే సందర్భంగా బాలకృష్ణ #107 మూవీ కి సంబందించిన ఓ అదిరిపోయే అప్టేట్‌ను ‘రాయల్ మీట్స్ ఫెరోసిటీ స్టే ట్యూన్డ్’ అంటూ రేపు ఉదయం 8.45 నిమిషాలకు రివీల్ చేయనున్నారు. ఈ సందర్బంగా ఓ ట్వీట్ కూడా చేసారు.