బిగ్ బాస్‌కు హోస్ట్‌గా బాలయ్య?
బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పటికప్పుడు చూడనంటూనే చూస్తూ ఉండే షో ఏదైనా ఉందా అంటే అది బిగ్ బాస్ యే అని చెప్పొచ్చు. ఎన్ని విమర్శలు, కామెంట్స్ వచ్చినా సరే ఈ షో సీజన్లు పెరగడం, ఆడియన్స్ దాన్ని చూడటం నార్మల్ అయిపోయింది. అన్ని భాషలతో పోలిస్తే తెలుగు బిగ్‌బాస్‌కు వ్యూయర్షిప్ తక్కువన్నది నిజం.
మొదటి సీజన్‌కు జూ.ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా, రెండో సీజన్‌కు నాని హోస్టింగ్ చేశాడు. ఇక ఆ తర్వాత నుంచి బిగ్ బాస్ కు హోస్ట్ గా నాగార్జున ఫిక్స్ అయిపోయాడు. నాగ్ హోస్టింగ్ బాగున్నప్పటికీ, ప్రస్తుత సీజన్‌కు ఆశించిన ఫలితాలు దక్కడం లేదు. దీంతో బిగ్ బాస్ సీజన్ 8 కు రేటింగ్స్ పెంచే దిశగా స్టార్ మా యాజమాన్యం ఆలోచిస్తున్నట్లు సమాచారం.
ఇందులో భాగంగానే బిగ్ బాస్8 కోసం నందమూరి బాలకృష్ణను సంప్రదించినట్లు టాక్ నడుస్తోంది. ఇందులో నిజమెంతున్నది పక్కన పెడితే, నిజంగా బాలయ్య బిగ్ బాస్ ను హోస్ట్ చేస్తే ఆ షో టీఆర్పీలు పెరగడం ఖాయం. బాలయ్య మాట్లాడే తీరు, ముఖ్యంగా వీకెండ్ లో ఎలిమేషన్ ఎపిసోడ్స్ లో బాలయ్య పార్టిసిపెంట్స్‌ను క్లాసులు పీకే తీరు ఆ షో టీఆర్పీని ఎక్కడికో తీసుకెళ్లడం గ్యారెంటీ.
ఇప్పటివరకు దీని గురించి అఫీషియల్ క్లారిటీ లేదు కాబట్టి ఈ వార్తలు నిజమేనని చెప్పలేం కానీ నిప్పు లేనిదే పొగ రాదన్నట్లు ఈ వార్త నిజమయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. అన్‌స్టాపబుల్ షోను బాలయ్య నడిపించిన తీరు చూసి బిగ్ బాస్ టీమ్ బాలయ్యతో ఈ షోను చేయాలనుకున్నారట. దానికి తోడు నాగార్జున వచ్చే ఏడాది తన వందో సినిమా పనులతో పాటూ, అన్నపూర్ణ బ్యానర్లో వరుసగా సినిమాలు తీయాలని చూస్తున్నారట. మరి బిగ్ బాస్ నెక్ట్స్ సీజన్‌కు హోస్ట్ మారతాడా లేదా అన్నది తెలియాలంటే కొంత కాలం ఆగక తప్పదు.













