బిగ్ బాస్ 8 హోస్ట్ ఆయనేనా?
బిగ్ బాస్ సీజన్7 సక్సెస్ ఫుల్ గా ముగిసింది. కామన్ మ్యాన్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఈ సీజన్లో విన్నర్ గా గెలిచాడు. మరో రెండు నెలల్లోనే బిగ్ బాస్ ఓటీటీ సీజన్2ని మొదలుపెట్టాలని చూస్తున్నారు. ఓటీటీ సీజన్ పై ఆడియన్స్ అంతగా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో లాస్ట్ ఇయర్ ఈ ఓటీటీ సీజన్ ను నిర్వాహకులు లైట్ తీసుకున్నారు.
ఇప్పుడు సీజన్7 సక్సెస్ అవడంతో బిగ్ బాస్ ఓటీటీ సెకండ్ సీజన్‌ను కూడా స్టార్ట్ చేయాలని చూస్తున్నారట. ఫిబ్రవరి, మార్చి నుంచి ఇది స్టార్ట్ అవుతుందని టాక్. ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్8 హోస్ట్ మారనున్నాడని ఇప్పటికే వార్తలొచ్చాయి. బిగ్‌బాస్1 ఎన్టీఆర్, సీజన్2 నాని హోస్ట్ చేయగా, ఆ తర్వాత నుంచి సీజన్ 7 వరకు నాగార్జునే చేస్తూ వచ్చాడు.
మధ్యలో నాగ్ తప్పుకోవాలని చూసినా, షో నిర్వాహకులు నాగ్ అడిగిన రెమ్యూనరేషన్ ఇచ్చి మరీ చేయించుకున్నారు. సీజన్8 విషయంలో ఈసారి నాగ్ కు బదులు వేరే వారిని హోస్ట్ గా తీసుకోవాలని చూస్తున్నారట. ఇందులో భాగంగానే బాలకృష్ణ బిగ్ బాస్ 8 ను హోస్ట్ చేయనున్నాడని వార్తలొస్తున్నాయి. బాలయ్య ఈ షోను హోస్ట్ చేస్తే బిగ్ బాస్ రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయం. మామూలుగానే తనకు నచ్చని పని చేస్తే ముక్కుసూటిగా చెప్పే బాలయ్య, బిగ్ బాస్ హోస్ట్ చేస్తే కంటెస్టెంట్స్ ని కడిగిపారేయడం ఖాయమని చెప్పొచ్చు. మరి ఈ వార్తల్లో నిజమెంతన్నది త్వరలోనే క్లారిటీ వస్తుంది.













