మరోసారి బాలయ్య-ఎన్టీఆర్ సినిమాల క్లాష్
ఒక కుటుంబానికి చెందిన ఇద్దరు హీరోల సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీపడటం చాలా రేర్. బాలకృష్ణ, ఎన్టీఆర్ ల మధ్య 2016లో సంక్రాంతికి అనుకోని పరిస్థితుల్లో ఈ క్లాష్ జరిగి, బాలయ్య డిక్టేకర్, తారక్ నాన్నకు ప్రేమతో ఒక్క రోజు గ్యాప్ తో రిలీజ్ అయ్యాయి. అప్పుడు నందమూరి ఫ్యాన్స్ రెండు వర్గాలుగా విడిపోయి గొడవ కూడా పడ్డారు.
అయితే ఆ టైమ్‌లో తారక్ సినిమా మంచి హిట్ అయిందది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య మళ్లీ అలాంటి క్లాష్ జరిగింది లేదు. ఇప్పుడు మళ్లీ వచ్చే ఏడాది సమ్మర్‌కు బాబాయ్-అబ్బాయ్ బాక్సాఫీస్ వద్ద తలపడబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తారక్ నటిస్తున్న దేవర ఏప్రిల్ 5కు రిలీజ్ షెడ్యూల్ అయిన సంగతి తెలిసిందే. దేవర రిలీజ్ విషయంలో ఎలాంటి అనుమానాలు పడక్కర్లేదని రీసెంట్ గా కౌంట్ డౌన్ పోస్టర్ తో మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
ఇక బాలయ్య, బాబీతో చేస్తున్న సినిమా రీసెంట్గా స్టార్ట్ అయింది. ఈ సినిమాను సమ్మర్ రిలీజ్ టార్గెట్ తో శరవేగంగా షూటింగ్ పూర్తి చేసే విధంగా సితార ఎంటర్టైన్మెంట్స్ షెడ్యూల్స్ ప్లాన్ చేసిందట. బాలయ్య కూడా ఫిబ్రవరి తర్వాత ఎలక్షన్స్ హడావిడిలో ఉంటాడు కాబట్టి ఈలోపు సినిమాను కంప్లీట్ చేయాలని చూస్తున్నారట. జనవరి నెలాఖరుకు షూటింగ్ పూర్తి చేసి, మార్చి 29న సినిమాను థియేటర్లలో దింపాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇదే నిజమైతే వారం గ్యాప్ లో ఎన్టీఆర్-బాలయ్య మధ్య పోటీ ఖాయమనే అనుకోవాలి.













