బాలయ్య-బోయపాటి సినిమా షురూ
సింహా, లెజెండ్ లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తోన్న హ్యాట్రీక్ చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.3 గా మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ క్లాప్‌నివ్వగా ప్రముక నిర్మాత అంబికా కృష్ణ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
ఫస్ట్ షాట్ లోనే ‘నువ్వొక మాటంటే అది శబ్దం’ అదే మాట నేనంటే అది ‘శాసనం’ అనే పవర్‌పుల్ డైలాగ్‌ను తనదైన స్టైల్లో చెప్పారు నటసింహ నందమూరి బాలకృష్ణ. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నటసింహ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ఈరోజు శుభదినం. ఎప్పుడు ఎప్పుడా అని అందరూ ఎదురుచూస్తున్న చిత్రం ప్రారంభం జరిగింది. మా కాంబినేషన్లో సినిమా అనగానే ప్రేక్షకుల్లో, అభిమానుల్లో చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఈ కథ అద్భుతంగా వచ్చింది. ఇండస్ట్రీకి మిర్యాల రవీందర్ లాంటి మంచి యంగ్ ప్రొడ్యూసర్స్ రావాల్సిన అవసరం ఎంతో ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు సి.కల్యాణ్, శివలెంక కృష్ణప్రసాద్ పాల్గొన్నారు.













