బోయపాటిపై ఆ ఎఫెక్ట్ అస్సలు లేదు
హిట్ పడితే ఎంత మంది ప్రశంసలు వస్తాయో, ఫ్లాప్ పడినా కూడా అంతేమంది విమర్శలు వస్తాయి. ఇంకా చెప్పాలంటే ఫ్లాప్ ప్రభావం ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. బోయపాటి శీనుకి ఇది బాగా ఎక్స్పీరియెన్స్. వినయ విధేయ రామ సినిమా చూశాక తనకు మళ్లీ మరో స్టార్ హీరో ఛాన్స్ ఇస్తాడా అనుకుంటే బాలయ్యతో అఖండ సినిమా ఛాన్స్ అందుకుని బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.
కానీ తర్వాత స్కంద సినిమా డిజాస్టర్ అయింది. హీరోగా రామ్ ఎంత కష్టపడినప్పటికీ బోయపాటి కథ, స్క్రీన్ ప్లే విషయంలో ఓవర్ ది బోర్డ్ వెళ్లేసరికి స్కంద విపరీతమైన ట్రోలింగ్స్ కు గురైంది. స్కంద సినిమా ఎంత ట్రోల్స్ కు గురైనప్పటికీ బోయపాటి మీద ఆ ఎఫెక్ట్ పెద్దగా పడలేదు. ఇప్పటికే బాలయ్యతో మూడు సినిమాలు చేసి హ్యాట్రిక్ సక్సెస్ అందుకున్న బోయపాటి, బాలయ్యతో నాలుగో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నాడు.
ఇప్పటికే బోయపాటికి బాలయ్య స్క్రిప్ట్ రెడీ చేసుకోమని చెప్పినట్లు తెలుస్తోంది. జూన్ నుంచి సెట్స్ కు వెళ్లే విధంగా ప్లాన్ చేయమని, కానీ ఇప్పుడే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించొద్దని బాలయ్య చెప్పాడట. మరోవైపు గీతా ఆర్ట్స్ లో బన్నీతో ఓ సినిమా కోసం బోయపాటి ఎప్పుడో అడ్వాన్స్ తీసుకున్నాడు. ఫ్లాప్ అందుకున్నప్పటికీ బోయపాటి చేతిలో రెండు క్రేజీ ఆఫర్లు ఉన్నాయి. కానీ బన్నీతో సినిమా అంటే ఇప్పట్లో కుదరడం కష్టమే.













