పూజాకు మళ్లీ ఆ టైమ్ వస్తుందా?
వరుస సినిమాలతో కొన్నేళ్ల పాటూ సినిమాలు చేసి, మంచి సక్సెస్ లు అందుకున్న పూజా హెగ్డే స్టార్ హీరోయిన్ స్టేటస్ ను బాగానే ఎంజాయ్ చేసింది. కానీ ఉన్నట్టుండి పూజా కెరీర్ ఒక్కసారిగా తలకిందులైంది. చేతిలో సినిమాలు లేక ఖాళీ గా ఉంది పూజా. ఆమె కెరీర్ ను స్పీడప్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది బుట్టబొమ్మ. మహేష్ సినిమా గుంటూరు కారంలో అవకాశం రావడంతో పూజాకు మళ్లీ ఆఫర్లు క్యూ కడతాయనుకుంటే ఆమె సినిమా నుంచి తప్పుకోవడంతో పూజా బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయిందని మళ్లీ టాక్స్ వచ్చాయి. కేవలం గుంటూరు కారం మాత్రమే కాదు పూజా చేతి నుంచి చాలా ఆఫర్లు చేజారాయని టాక్. ఆ మధ్య పవన్ సినిమా కోసం పూజాని సంప్రదించినట్లు వార్తలొచ్చాయి కానీ ఇప్పుడు పూజా కాకుండా మరో హీరోయిన్ తో సినిమా షూటింగ్ జరుగుతుందని తెలుస్తోంది.
బాలీవుడ్ లో కూడా రెండు ఆఫర్లు వచ్చి పోయాయని పూజా ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. కొంతమంది అసలు మళ్లీ పూజా కెరీర్ మునుపటిలా మారుతుందా లేదా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చేతిలో సినిమాలున్నా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం పూజా అందాల ఆరబోత ఏ మాత్రం తగ్గించకుండా గ్లామర్ షో చేస్తుంది.













