బ్యాడ్ న్యూజ్ గురించి ఎందుకు నోరెత్తడం లేదు?
గతేడాది రిలీజైన యానిమల్ సినిమా మీద బాలీవుడ్ లోని ప్రముఖులు ఏ స్థాయిలో కామెంట్స్ చేశారో గుర్తుండే ఉంటుంది. వారి కామెంట్స్ కు డైరెక్టర్ సందీప్ ఆన్సర్ ఇచ్చి వాళ్ల నోళ్లు మూయించాడు కానీ వేరే ఎవరైనా అయితే అన్నీ సైలెంట్ గా భరించేవాళ్లు. యానిమల్ లో హీరో క్యారెక్టరైజేషన్, మహిళలను చూపించిన తీరు, హింస ఎక్కువైందని ఎంతో మంది కామెంట్ చేశారు. అయితే గతాన్ని వదిలేసి ప్రస్తుతంలోకి వస్తే రీసెంట్ గా రిలీజైన బ్యాడ్ న్యూజ్ సినిమా బాలీవుడ్ లో మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. యానిమల్ లో నటించిన త్రిప్తి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా ఓ అమ్మాయి ఇద్దరు మగాళ్లతో సంబంధం పెట్టుకుని, వాళ్ల ద్వారా గర్భం దాల్చి, కడుపులో ఉన్న బిడ్డకు తండ్రెవరో కనిపెట్టేందుకు చాలా విచిత్రమైన పరీక్షలు పెట్టే కాన్సెప్ట్ తో రూపొందింది.
సమాజంలో ఎవరూ అంగీకరించలేని అంశం మీద ఈ సినిమా తెరకెక్కింది. యానిమల్ సినిమా మీద కామెంట్స్ చేసిన ఎవరూ ఈ సినిమా గురించి మాట్లాడటం లేదు. కామెడీకి తీశామని చెప్తున్నా కామెడీ కోసం ఇంతలా దిగజారాల్సిన పన్లేదనేది వాస్తవం. ఈ సినిమా కలెక్షన్ల పరంగా హిట్ అనిపించుకున్నప్పటికీ కంటెంట్ పరంగా మాత్రం ఆలోచించాల్సిందే













