బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రానున్న కావ్య పాప
హీరోయిన్ల కొరత అనే అంశాన్ని సరిగ్గా వాడుకోవాలే కానీ లేటయినా సరే మంచి ఛాన్సులొస్తాయని చెప్పడానికి హీరోయిన్ కావ్య థాపర్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ మాయ పేరేమిటో సినిమాతో 2018లో పరిచయమైన ఈ భామకు మొదటి సినిమా నిరాశనే మిగిల్చింది. తర్వాత సంతోష్ శోభన్ తో ఏక్ మినీ కథలో నటించింది. ఈ సినిమాకు మంచి పేరొచ్చినా అది ఓటీటీ రిలీజ్ కావడంతో పెద్దగా రీచ్ అవలేదు.
అయితే ఇప్పుడు అమ్మడుకు బాగా కలిసొస్తుంది. కేవలం వారం రోజుల గ్యాప్ తో కావ్య నుంచి ఈగల్, ఊరు పేరు భైరవకోన రిలీజ్ కానున్నాయి. ఈ రెండు సినిమాల్లోనూ మంచి ప్రాధాన్యం ఉన్న పాత్రలే చేసినట్ల చెప్తోంది. ఇవి కాకుండా రామ్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తోన్న డబుల్ ఇస్మార్ట్ లో కూడా నటిస్తున్నాని, ఆ సినిమా తనకు మంచి బ్రేక్ ఇస్తుందని ధీమా వ్యక్తం చేస్తోంది.
శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో కూడా అమ్మడు హీరోయిన్. మొత్తానికి అమ్మడు నుంచి ఈ ఏడాది నాలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయన్నమాట. ఈ నాలుగింటిలో ఏ రెండు సినిమాలు మంచి హిట్స్ గా నిలిచినా అమ్మడుకి బ్రేక్ దొరికినట్లే. మరి ఈగల్, ఊరు పేరు భైరవకోన సినిమాలు కావ్య థాపర్ కెరీర్ ను ఎలా తీసుకెళ్తాయో చూడాలి.













