బ్యాచిలర్ పార్టీ మొదలైంది
భూపాల్, అరుణ్ కథానాయకులుగా డి.రామకృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రం బ్యాచిలర్ పార్టీ. బి.సుధాకర్‌రెడ్డి, డి.సుబ్బారావు నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. కథానాయకుడు శ్రీకాంత్ క్లాప్‌నిచ్చారు. దర్శకుడు మాట్లాడుతూ ఉత్కంఠ రేకెత్తించే కథతో యాక్షన్ ప్రధానంగా సాగే చిత్రమిది. యువ తరానికి వినోదాన్ని పంచుతుంది అన్నారు. వాణిజ్య హంగులతో రూపొందుతున్న చిత్రమిది. వచ్చే వారం నుంచి చిత్రీకరణని ప్రారంభిస్తాం అన్నారు నిర్మాత. రమణారెడ్డి, బెనర్జీ, కార్తీక్, రియా, గిరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: అద్దంకి రాము.













