దసరా, సామజవరగమన ను మించిన బేబీ
ఈ ఇయర్ రిలీజైన సినిమాల్లో టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ఒకటిగా పేరు తెచ్చుకున్న సినిమా బేబీ. చిన్న సినిమాగా రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. 90 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన బేబీ ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపరిచింది. ఓటీటీలో ఈ సినిమాకు మిక్డ్స్ రెస్పాన్స్ రావడంతో ఇక టీవీలో ఫ్లాప్ అవడం ఖాయమనుకున్నారంతా.
కానీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ బేబీ సినిమా టీవీలో కూడా సూపర్ హిట్ గా నిలిచింది. గతవారం టెలికాస్ట్ అయిన బేబీ సినిమా 5,89 అర్బన్, 5.67 రూరల్ టీఆర్పీలతో ఆ రోజు టెలికాస్ట్ అయిన మరో రెండు సూపర్ హిట్ సినిమాలను మించి సాధించింది. ఆ రోజు ప్రసారమైన నాని దసరా సినిమా 4.99 టీఆర్పీలతో రెండో ప్లేస్ సాధించగా, శ్రీ విష్ణు నటించిన సామజవరగమన 3.05 రేటింగ్స్ తో మూడో స్థానంలో నిలిచింది.
దీనికి కారణం బేబీ సినిమాను ఈటీవీ కొనడం, మరొకటి దసరా, సామజవరగమన లాంటి సినిమాలను ఇప్పటికే ఆడియన్స్ ఓటీటీలో ఎక్కువ సార్లు చూసి ఉండటం. బేబీ సినిమాను ఓటీటీలో చూడటానికి ప్రేక్షకులు ఎగ్జైటింగ్ గా ఫీలవలేదు దానిక్కారణం సినిమా క్యాస్టింగ్. అందుకే ఈ సినిమా టీవీలో ఎక్కువ టీఆర్పీ సాధించి మరో రేర్ ఫీట్ ను సాధించింది.













