Baahubali the epic: వార్2, కూలీతో బాహుబలి ది ఎపిక్ టీజర్
రాజమౌళి(rajamouli) దర్శకత్వంలో వచ్చిన బాహుబలి(bahubali) ఫ్రాంచైజ్ సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాహుబలి1, బాహుబలి2 రెండు సినిమాలూ వేటికవే సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. అయితే మొదటి భాగం వచ్చి 10 సంవత్సరాలవుతున్న నేపథ్యంలో మేకర్స్ ఆ రెండు భాగాలను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో రిలీజ్ చేయనున్నామని ప్రకటించిన విషయం తెలిసిందే.
ఓ వైపు మహేష్ బాబు(mahesh babu) హీరోగా తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ గ్లోబ్ ట్రాట్ సినిమా పనులతో పాటూ మరోవైపు బాహుబలి ది ఎపిక్(baahubali the epic) ఎడిటింగ్ పనులను కూడా చూసుకుంటున్నాడు జక్కన్న. అయితే ఇప్పుడా పనులు ఓ కొలిక్కి వచ్చాయని తెలుస్తోంది. అందులో భాగంగానే దానికి సంబంధించిన టీజర్ ను కూడా రెడీ చేశారని, ఆ టీజర్ కోసం చిత్ర యూనిట్ చాలా భారీ ప్లాన్ ను వేసినట్టు తెలుస్తోంది.
ఆగస్ట్ 14న రిలీజ్ కానున్న వార్2(war2), కూలీ(Coolie) సినిమాలతో పాటూ బాహుబలి ది ఎపిక్ కు సంబంధించిన టీజర్ ను ఎటాచ్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ రెండు సినిమాలకూ మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో ఆ సినిమాలతో పాటూ టీజర్ ను రిలీజ్ చేస్తే సినిమాపై ఉన్న క్రేజ్ మరింత పెరిగే ఛాన్సుందని జక్కన్న ఈ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. రీరిలీజుల ట్రెండ్ లో తమ సినిమాను మరింత స్పెషల్ గా నిలపాలని రాజమౌళి దీని కోసం స్పెషల్ ప్రమోషన్స్ కూడా ప్లాన్ చేసినట్టు సమాచారం. అక్టోబర్ 31న బాహుబలి ది ఎపిక్ ప్రేక్షకుల ముందుకు రానుంది.







