అమెరికాలో బాహుబలికి మరో అరుదైన గౌరవం
బాక్సాఫీసు లెక్కల్ని తిరగరాసిన చిత్రం బాహుబలి. బాహుబలి 2 కూడా అనేక సంచలనాలకు కేంద్రబిందువు అయ్యింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అంతర్జాతీయంగా పలు అవార్డులను అందుకుంది. ఇప్పుడు మరో గౌరవం దక్కింది. కాలిఫోర్నియాలో జరిగిన 44వ సాటర్న్ అవార్డ్స్‌లో ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా బాహుబలి 2 నిలిచింది. ఈ విభాగంలో ఆరు చిత్రాలు పోటీపడితే మన బాహుబలికి అవార్డు దక్కింది. అకాడమీ ఆఫ్ సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ అండ్ హారర్ ఫిల్మ్స్ అనే సంస్థ ప్రతీయేటా ఈ అవార్డులను అందజేస్తోంది.













