Rajamouli: స్పెషల్ వీడియోను రిలీజ్ చేసిన బాహుబలి టీమ్

కెరీర్ స్టార్టింగ్ నుంచి ఫ్లాప్ లేని డైరెక్టర్ గా రాజమౌళి(rajamouli)కి మంచి పేరుంది. ఇప్పటివరకు ఆయన దర్శకత్వంలో వచ్చిన ప్రతీ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకున్నదే. అంతేకాదు, సినిమా సినిమాకీ ఆయన క్రేజ్, మార్కెట్ ప్రపంచస్థాయిలో పెరుగుతూనే ఉంది. బాహుబలి(baahubali), ఆర్ఆర్ఆర్(RRR) సినిమాలతో తెలుగు సినిమా స్థాయికి ప్రపంచానికి చాటి చెప్పాడు జక్కన్న(Jakkanna).
అలాంటి రాజమౌళి బర్త్ డే ఇవాళ. జక్కన్న పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు పలువురు విషెస్ తెలియచేశారు. ఆయనతో వర్క్ చేసిన వాళ్లే కాకుండా ఎంతోమంది సెలబ్రిటీలు రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ప్రస్తుతం రాజమౌళితో వర్క్ చేస్తున్న మహేష్ బాబు(Mahesh babu) కూడా ఆయనకు విషెస్ చెప్పగా, మహేష్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అయితే రాజమౌళి బర్త్ డే సందర్భంగా బాహుబలి టీమ్ ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది. ది మేకింగ్ ఆఫ్ మ్యాజిక్(the making of magic) అనే పేరుతో వచ్చిన ఈ స్పెషల్ వీడియోలో రాజమౌళి సెట్స్ లో ఎలా ఉంటారో, ఆయన యాక్టర్లను ఎలా గైడ్ చేస్తారో కనిపించడంతో పాటూ సినిమా కోసం ఆయనెంత తపనగా పని చేస్తారనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బాహుబలి టీమ్ రిలీజ్ చేసిన ఈ స్పెషల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కాగా, ఈ నెల 31న బాహుబలి రెండు సినిమాలను ఒకే సినిమాగా చేసి రీరిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.