చైనాలో బాహుబలి 2 సరికొత్త రికార్డు
తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన బాహుబలి చిత్రం రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. రాజమౌళి అద్భుత సృష్టి బాహుబలి 2 ఇప్పటికే పలు దేశాలలో విడుదలై సంచలనం క్రియేట్ చేయగా, ఇప్పుడు చైనాలోను సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తుంది. ఇప్పటి వరకు చైనాలో ఏ భారతీయ చిత్రం కూడా ఐమాక్స్ ఫార్మాట్లో విడుదలకాలేదు. అలాంటిది బాహుబలి-2 మాత్రం మే 4న భారీ ఎత్తున ఐమాక్స్ ఫార్మాట్లో రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. మరి బాహుబలి ఈ సారైన చైనా బాక్సాఫీస్‌ను కొల్లగొడతాడేమో చూడాలి.













