బాహుబలి కి మరో గౌరవం
భారతీయ చిత్ర పరిశ్రమ గర్వపడేలా అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించింది బాహుబలి 2. ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకొందీ చిత్రం. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వ ప్రతిభను విశ్వవ్యాప్తంగా చేసిన ఈ చిత్రానికి మరో గౌరవం దక్కింది. రష్యాలో జరిగే మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో తొలి చిత్రంగా బాహుబలి 2 ప్రదర్శితం కానుంది. ఈ విషయమై రాజమౌళి సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అందులో బాహుబలి 2 తొలి చిత్రంగా ప్రదర్శితం కావడం గర్వంగా ఉందన్నారు. రాజమౌళి, ప్రభాస్, రానా, అనుష్క, సత్యరాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం రూ.2000 కోట్ల వసూళ్ల దిశగా అడుగులేస్తోంది.













