యాభైరోజులకు చేరిన బాహుబలి
బాహుబలి 2 చిత్రం విజయ విహారం చేస్తూ, చూస్తుండగానే యాభై రోజులను పూర్తి చేసుకుంది. పలు థియేటర్లలో ప్రేక్షకులు పలుచగా వున్నా అర్థసెంచరీకోసం సినిమాను ఆడిస్తున్నట్లు సమాచారం. కాగా, పైసా ఖర్చులేకుండా పబ్లిసిటీపరంగా సోషల్‌మీడియాను వుపయోగించుకున్న ఘనత రాజహౌళికే దక్కింది. తొలి రోజునే ప్రపంచ వ్యాప్తంగా 121 కోట్లను వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 300 కోట్లవరకూ వసూలు చేసిన ఈ సినిమా, హిందీలో 500 కోట్ల వరకూ రాబట్టడం జరిగిందని చిత్ర యూనిట్ లెక్కలు చెబుతోంది. ఏదిఏమైనా అవేష ప్రజానీకాన్ని ఆశ్చర్యచకితులను చేస్తూ వెయ్యి కోట్లు దాటి రికార్డును సృష్టించింది. చైనాలో త్వరలో విడుదలకాబోతుంది.













