గ్లామర్ పాత్రలకు అవికాగోర్ సై…
చిన్నతనంలోనే వచ్చిన సెలబ్రిటీ హోదా తెచ్చుకుంది నటి అవికాగోర్. చిన్నారి పెళ్లికూతురు సీనియర్‌తో వెలుగులోకి వచ్చిన అవికా ఆ తర్వాత ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్గా ప్రమోషన్ పొందింది. ఆ తర్వాత లక్ష్మీరావె మా ఇంటికి, సినిమా చూపిస్త మామ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత కూడా ఆమెను అనేక అవకాశాలు వచ్చాయి. అయితే సెలబ్రిటీ వల్ల వచ్చిన హోదా వల్ల ఆమె వ్యవహారం నిర్మాతలకు ఇబ్బంది కలిగించింది. సినిమాలు ఒప్పుకునేందుకు అనేక షరతులు విధించింది. దాంతో ఆమెకు హీరోయిన్ ఛాన్స్‌లు అనుకున్న విధంగా దక్కలేదు. ఇప్పుడు అవికా పేరును పరిశ్రమ మర్చిపోయింది. జరిగిన పొరాపాటు గ్రహించి, తన ఆలోచన సరళి మార్చుకున్నట్టు తెలిసింది. ఓవైపు సీనియర్స్‌లో నటిస్తూనే సినిమాలపై దృష్టి నిలిపింది. గ్లామర్ పాత్రలు చేసేందుకు సిద్ధమైంది. ఆమె కొత్త ఫోటో అల్బమ్ చూస్తే అవికా అందాల ప్రదర్శనకు సిద్ధమే అని సృష్టమవుతుంది. సహజంగా బాలీవుడ్ భామలు ఫోటో షూట్స్ ద్వారానే ప్రేక్షకులను, పరిశ్రమను ఆకట్టుకుంటారు. ఇదే ఫార్ములాను అవికా ఫాలో అవుతోంది. ఇది ఎంత వరకు వర్కవుట్ అవుతుందనేది చూడాలి.













