మైత్రీకి ఆ రోజు బిగ్ డే
మొదటి సినిమా శ్రీమంతుడు తోనే మంచి సక్సెస్ అందుకున్న మైత్రీ మూవీ మేకర్స్ ఆ తర్వాత టాలీవుడ్ లోనే టాప్ ప్రొడక్షన్ హౌస్ గా ఎదిగింది. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ తమ బ్యానర్ ను ఎస్టాబ్లిష్ చేశారు. మధ్యలో మిగిలిన నిర్మాణ సంస్థల్లానే ఫ్లాపులు ఎదుర్కొన్నప్పటికీ హిట్లు మాత్రం వరుసగా వస్తున్నాయి.
ఓ వైపు భారీ పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తూనే మరోవైపు డిస్ట్రిబ్యూషన్ లో సత్తా చాటాలని చూస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్. ముఖ్యంలో నైజాంలో ఇప్పటికే మంచి పట్టున్న ఏషియన్, దిల్ రాజు, సురేష్ సంస్థలకు ధీటుగా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థతో పాటూ థియేటర్ రంగంలోనూ విస్తరణను చేపట్టారు. వచ్చే నెల 15న రిలీజ్ కాబోతున్న డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్, తంగలాన్ సినిమాల తెలంగాణ హక్కులను మైత్రీ సంస్థే సొంతం చేసుకుంది.
ఎంత మొత్తానికి రైట్స్ కొనుగోలు చేసిందనేది తెలియలేదు కానీ చాలా క్రేజీ రేట్లకు క్లోజ్ చేశారని టాక్. గతేడాది తమ బ్యానర్ నుంచి వచ్చిన వాల్తేరు వీరయ్య, వీర సింహరెడ్డి సినిమాలకు థియేటర్ల విషయంలో వచ్చిన ఇబ్బంది మళ్లీ ఎదురవకుండా ఉండేందుకు పక్కా ప్లానింగ్ తో సింగిల్ స్క్రీన్స్ ను లీజుకు తీసుకుని వాటిని రినోవేట్ చేయించి మరీ రన్ చేస్తున్నారు. ఓ వైపు సినిమాలు నిర్మిస్తూనే మరోవైపు ఇంత భారీ స్థాయిలో సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేయడం చూస్తుంటే మైత్రీ సంస్థ దూకుడు ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఆగస్ట్ 15 మైత్రీ సంస్థకు బిగ్ డే కానుంది.













