Gurrampapi Reddy: “గుర్రం పాపిరెడ్డి” లాంటి కొత్త తరహా సినిమాలను ప్రేక్షకులు ఆదరించి సపోర్ట్ చేయాలి – బ్రహ్మానందం
నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా “గుర్రం పాపిరెడ్డి”. ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్నారు. “గుర్రం పాపిరెడ్డి” సినిమా ఈ నెల 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
డైలాగ్ రైటర్ నిరంజన్ మాట్లాడుతూ – “గుర్రం పాపిరెడ్డి” సినిమాతో ఒక కొత్త ప్రయత్నం చేశాం. ఈ మధ్య కొత్త సినిమా చేశామనే చెప్పాలంటే భయంగా ఉంటోంది. రెగ్యులర్ కమర్షియల్ మూవీ అంటే పాత చింతకాయ పచ్చడి అనుకుంటారు. ప్రేక్షకులకు ఒక కొత్త సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇవ్వాలని ఈ చిత్రాన్ని డిఫరెంట్ గా రూపొందించాం. ఈ నెల 19న రిలీజ్ అవుతున్న మా చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాం. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ కృష్ణ సౌరభ్ మాట్లాడుతూ – ఈ సినిమాకు వర్క్ చేయడం ప్రతి రోజూ ఎగ్జైటింగ్ ఫీల్ కలిగించింది. కొత్త జానర్స్ లో సాంగ్స్ ను కంపోజ్ చేశాం. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్ పైసా డుమ్ డుమ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫరియా గారు సింగర్ గా ఆకట్టుకుంటారు. ఈ మూవీ జర్నీలో నాకు సపోర్ట్ చేసిన మా టీమ్ అందరికీ థ్యాంక్స్. అన్నారు.
డైరెక్టర్ మురళీ మనోహర్ మాట్లాడుతూ – ఈ సినిమా నేను స్టార్ట్ చేయడానికి మొదటి కారణం నా ఫ్రెండ్ ప్రొడ్యూసర్ బాబీ. అతని వల్లే నేనీ మూవీ మొదలుపెట్టాను. ఎవరికైనా ఫ్రీడమ్ ఇచ్చినప్పుడే వర్క్ బాగా చేయగలుగుతారు. ఈ సినిమాకు నాకు ప్రొడ్యూసర్స్ కావాల్సినంత క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చారు. వారు నాకు ఇచ్చిన సపోర్ట్ గురించి మాట్లాడుతుంటే ఎమోషనల్ గా ఉంది. తెలుగు ఆడియెన్స్ కు ఒక కొత్త తరహా సినిమా చూపించాలనే అందరం ఎఫర్ట్స్ పెట్టాం. కొత్త తరహా సినిమా అని ఎక్కడా మన నేటివిటీ దాటి వెళ్లలేదు. మా మూవీ టీమ్ లోని ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరూ దర్శకుడిగా నా ప్రయత్నానికి సపోర్ట్ గా నిలిచారు. వారందరికీ థ్యాంక్స్. ఈ నెల 19న “గుర్రం పాపిరెడ్డి” సినిమా రిలీజ్ అవుతుంది. థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి. అన్నారు.
ప్రొడ్యూసర్ అమర్ బురా మాట్లాడుతూ – మా మూవీ బాగా వచ్చిందంటే అందుకు కారణం మా డైరెక్టర్ మురళీ. మొదటి నుంచి అతను మాకు చెబుతూనే ఉన్నాడు, ఈ సినిమాతో మిమ్మల్ని గర్వపడేలా చేస్తానని. చెప్పినట్లే ట్రైలర్ తో ప్రూవ్ చేశాడు. మా ట్రైలర్ చూసిన యూఎస్ మిత్రులు, డిస్ట్రిబ్యూటర్స్ కంటెంట్ గురించే మాట్లాడుతున్నారు. మా కాంబినేషన్ జర్నీ ఆగదు. ఇకపైనా కలిసి సినిమాలు చేయాలనుకుంటున్నాం. మా డైరెక్టర్ మురళీ మనోహర్ కోసమైనా ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. అలాగే బ్రహ్మానందం గారు ప్రతి సందర్భంలో మమ్మల్ని సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. సినిమా ఎలా వస్తుందంటూ ఫోన్ చేసి అడుగేవారు. యోగి బాబు గారి డేట్స్ పట్టుకోవడం కష్టం. ఆయన కోసం రెండు నెలల వెయిట్ చేశాం. ఆయన క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది. అలాగే మా ఆర్టిస్టులు, జీవన్, వంశీధర్, రాజ్ కుమార్ కసిరెడ్డి మిమ్మల్ని నవ్విస్తారు. ఈ మధ్య టూర్స్ కు వెళ్లినప్పుడు మాకు మంచి రెస్పాన్స్ దక్కింది. నరేష్ అగస్త్య సోషల్ మీడియాకు దూరంగా ఉంటాడు. కానీ మా మూవీ కోసం ప్రమోషన్స్ కు బాగా వస్తున్నాడు. అన్ని ప్లేసెస్ తిరుగుతున్నాడు. ఫరియా మంచి నటి మాత్రమే కాదు వర్సటైల్ యాక్టర్. ఆమె నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ నెల 19న గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్నాం. మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాం. అన్నారు.
హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ – ఈ సినిమాలో సౌధామిని క్యారెక్టర్ లో మీ ముందుకు వస్తున్నాను. ఒక డిఫరెంట్ డార్క్ కామెడీ చిత్రమిది. ఈ ఈవెంట్ లో మా డైరెక్టర్ మురళీ మనోహర్ గారు ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. అలాంటి క్రియేటివ్ పర్సన్ భావోద్వానికి గురయ్యారంటే మూవీ కోసం ఎంత తపన పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. కృష్ణ సౌరభ్ పాటలతోనే కాదు తన బీజీఎంతో కూడా మూవీని మరో ఎత్తుకు తీసుకెళ్లారు. ఈ మూవీలో నేను ఒక సాంగ్ రాసి పాడి కొరియోగ్రాఫ్ చేశాను. మా ప్రొడ్యూసర్స్ ఒక ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ లా మారిపోయారు. వాళ్లతో టూర్ చేసినట్లు షూటింగ్ కంప్లీట్ చేశాం. ఎక్కడా మాకు స్ట్రెస్ ఇవ్వలేదు. మా మూవీని చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాం. అన్నారు.
హీరో నరేష్ అగస్త్య మాట్లాడుతూ – “గుర్రం పాపిరెడ్డి” చిత్రంలో లీడ్ రోల్ చేసే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. ఇందులో మూడు నాలుగు డిఫరెంట్ గెటప్స్ లో కూడా కనిపిస్తా. ఓల్డ్ ఏజ్ గెటప్ కోసం చాలా కష్టపడాల్సివచ్చింది. డైరెక్టర్ మురళీ, ప్రొడ్యూసర్ అమర్ గారు మమ్మల్ని బాగా చూసుకున్నారు. ఎక్కడా ఒత్తిడి లేకుండా షూటింగ్ జరిగేలా చేశారు. వాళ్లకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. మా అమర్ గారు మంచి యాక్టర్ కూడా. నెక్ట్స్ నటుడిగా ప్రయత్నించాలని కోరుతున్నా. రీసెంట్ గా మేము ప్రమోషనల్ టూర్స్ వెళ్లినప్పుడు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. వైజాగ్ ఆడియెన్స్ మమ్మల్ని ఎంతో సపోర్ట్ చేశారు. కృష్ణ సౌరభ్ మ్యూజిక్ మా మూవీకి హైలైట్ అవుతుంది. ఆయన ఫరియాతో పాడించినట్లు నాతోనూ ఒక పాట పాడిస్తారని అనుకున్నా. నిరంజన్ రాసిన కామెడీ పంచ్ డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. ఈ నెల 19న మా మూవీ రిలీజ్ కు వస్తోంది. మా సినిమా చూసి మీ రెస్పాన్స్ తెలియజేస్తారని ఆశిస్తున్నా. అన్నారు.
లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం మాట్లాడుతూ – “గుర్రం పాపిరెడ్డి” సినిమాలో నేను ఇంపార్టెంట్ రోల్ చేశాను. కథను ప్రేక్షకులకు తెలియజేసే జడ్జి పాత్రలో నటించాను. ఇదొక డిఫరెంట్ స్టోరీ. ఈ చిత్రాన్ని ఇప్పటి ప్రేక్షకులకు నచ్చేలా కొత్త పద్ధతిలో దర్శకుడు మురళీ మనోహర్ తెరకెక్కించాడు. యోగి బాబు పాత్ర స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటుంది. అతనితో నాకు కాంబినేషన్స్ సీన్స్ ఉండవు కానీ యోగిబాబు ఈ మూవీలో హిలేరియస్ కామెడీ చేశాడు. జీవన్ కుమార్, రాజ్ కుమార్ కసిరెడ్డి, వశీధర్ కోసిగి తమ పాత్రల్లో బాగా నటించారు. దర్శకుడు వారితో అలా పర్ ఫార్మ్ చేయించారు. నేను సెట్ లో ఉన్నప్పుడు హీరో హీరోయిన్స్ ఓల్డ్ గెటప్ లో వచ్చి కలిశారు. ఎవరో బయటవారు షూటింగ్ చూసేందుకు వచ్చారని అనుకున్నా. ఇలా డిఫరెంట్ గెటప్స్ లో హీరో నరేష్, హీరోయిన్ ఫరియా ఆకట్టుకుంటారు. ప్రొడ్యూసర్స్ సినిమా బాగా వచ్చేలా రాజీ పడకుండా నిర్మించారు. ఈ నెల 19న “గుర్రం పాపిరెడ్డి” రిలీజ్ అవుతోంది. కొత్త వాళ్లు చేసిన ఇలాంటి చిత్రాలను ఆదరిస్తే ఇండస్ట్రీ బాగుంటుంది. మరిన్ని మంచి చిత్రాలు వారు చేసే అవకాశం కలుగుతుంది. అన్నారు.






