అప్డేట్ తో వివాదాలకు చెక్ పెట్టొచ్చుగా పుష్పా?
ఏపీ ఎలక్షన్స్ ముందు వరకు పుష్ప2 మీద మంచి హైప్ ఉంది. ఎప్పుడెప్పుడు పుష్ప2 రిలీజవుతుందా ఈసారి పుష్పరాజ్ స్క్రీన్ పై ఎంత రచ్చ చేస్తాడా చూడాలని ఆడియన్స్ ఎంతో వెయిట్ చేశారు. కానీ ఎలక్షన్స్ టైమ్ లో బన్నీ, వైసీపీ తరపున పోటీ చేస్తున్న తన ఫ్రెండ్ కు సపోర్ట్ చేయడంతో మెగా ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా బన్నీని టార్గెట్ చేశారు.
అప్పటి నుంచి ఈ వివాదం జరుగుతూనే ఉంది. సోషల్ మీడియాలో అల్లు ఆర్మీ వర్సెస్ మెగా ఫ్యామిలీ అని గొడవలు జరుగుతున్నాయి. ఆ తర్వాత పుష్ప2 పోస్ట్ పోన్ అయి డిసెంబర్ 6కి రిలీజ్ కానున్నట్లు అనౌన్స్ చేయడంతో ఉన్న బజ్ అంతా ఈ కారణాలతో పోయింది. పుష్ప2 అనగానే ఎవరికైనా సరే ఇప్పుడివే గుర్తొస్తున్నాయి.
ఇలాంటి టైమ్ లో తిరిగి పుష్ప2 కు హైప్ క్రియేట్ చేయాలంటే ఫ్యాన్స్ ఆశించే ఏదొక అప్డేట్ ఇవ్వాలి. ఈ సినిమా నుంచి టీజర్ లేదా సాంగ్ ఏదొకటి రిలీజ్ చేస్తే ఆడియన్స్ ఈ ఇష్యూలను మరిచిపోయి వాటిని ఎంజాయ్ చేస్తారు. సినిమా మీదున్న నెగిటివిటీని ఏదొక అప్డేట్ ఇచ్చి ప్రమోషన్స్ రూపంలో కొట్టిపారేస్తే అన్నీ సెట్ అవుతాయని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో పుష్ప2 మేకర్స్ మనసులో ఏముందో చూడాలి.













