ఆ కాంబో కోసం ఆడియన్స్ వెయిటింగ్
సినిమా కథతో సంబంధం లేకుండా కొన్ని కాంబినేషన్స్ డామినేట్ చేస్తుంటాయి. అందులో ముఖ్యమైనది హీరో హీరోయిన్ కాంబినేషన్. ఇప్పటికే ఓసారి కలిసి పని చేసిన వారైతే ఒకలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అలా కాకుండా ఇదివరకు కలిసి చేయని హీరో హీరోయిన్ గురించి కూడా ఆడియన్స్ అంచనాలు పెట్టుకుంటారు.
అలాంటి కాంబినేషన్ ఒకటి ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆ కాంబో మరేంటో కాదు విజయ్ దేవరకొండ- పూజా హెగ్డే. ఇప్పటివరకు వీరిద్దరూ కలిసి నటించింది లేదు. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా అనౌన్స్ చేసిన జన గణ మన సినిమాలో పూజానే హీరోయిన్ గా ఎంపిక చేశారు.
కొంత పార్ట్ షూటింగ్ కూడా చేశారు. కానీ లైగర్ ఫ్లాప్ అవడంతో ఆ సినిమా క్యాన్సిల్ అయింది. ఫలితంగా వీరిద్దరూ కలిసి నటించలేకపోయారు. అయితే తాజాగా చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్ కు వీరిద్దరూ అటెండ్ అయ్యారు. ఆ ఈవెంట్ లో స్టేజ్ మీద విజయ్ తో కలిసి ఫ్యామిలీ స్టార్ లోని నందనందన సాంగ్ కు పూజా కాలు కదిపింది. దీంతో వీరిద్దరినీ పక్కపక్కన చూసిన వారు వీరి కాంబోలో సినిమా వస్తే బావుంటుందని ఆశ పడుతున్నారు. మరి ఆడియన్స్ కోరుకుంటున్న ఈ కాంబో ఎప్పటికి సెట్ అవుతుందో చూడాలి.













