మాస్ సినిమాలకే ఓటేస్తున్న ఆడియన్స్..
రొటీన్ సినిమాలని చూసి బోర్ కొట్టిన ఆడియన్స్ ఈ మధ్య కాస్త కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. అయితే ఒకే రకం సినిమాలని ప్రేక్షకులు ఆదరించరు అనే విషయం అందరికి తెలిసిందే. కానీ, ఇప్పుడు ప్రేక్షకుల ఆలోచన విధానం సైతం కాస్త మారినట్లుగా కనిపిస్తుంది. ఎక్కువ మాస్ సినిమాలకే మొగ్గుచూపుతున్నారు నేటి తరం ఆడియన్స్. రీసెంట్ గా జరిగిన సర్వే లో మంచి కంటెంట్ తో పక్కా మాస్ సినిమా తీస్తే హిట్ కి ఢోకా ఉండదని వెల్లడైంది.
ఈ మధ్య కాలంలో రిలీజైన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలని ఆడియన్స్ ఎంతగా ఆదరించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రవితేజ నటించిన ధమాకా, అఖండ సినిమాలు కూడా ఈ ప్రాపగాండాని ప్రూవ్ చేసాయి అని చెప్పాలి. ఇక అఖండ సినిమా విషయానికి వస్తే వసూళ్ల పరంగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇటు వాల్తేరు వీరయ్య, అటు వీరసింహారెడ్డి రెండు కూడా మూస కంటెంట్ తో వచ్చిన మాస్ సినిమాలే, అయినా కూడా ఆడియన్స్ ఈ సినిమాలని బాగానే ఆదరించారు.
ఈ నేపథ్యంలో మేకర్స్ సైతం మాస్ సినిమాలు తీయడానికే ఎక్కువ ఇష్టపడుతున్నారు. పెద్ద హీరోలతో మాస్ సినిమాలు తెరకెక్కించి హిట్ కొడ్తున్నారు దర్శకులు. మెగాస్టార్, బాలకృష్ణ, రవితేజ సినిమాలకి వచ్చిన కలెక్షన్స్ తో మేకర్స్ కి మాస్ సినిమాలు తీయొచ్చు అనే ధైర్యం వచ్చిందని చెప్పాలి. అయితే ప్రతిసారి ఈ మ్యాజిక్ రిపీట్ అవుతుందని చెప్పలేము. పర్ఫెక్ట్ కథా కథనంతో కనుక ప్రేక్షకులని మెప్పించగలిగితే ఏ సినిమాకైనా తిరుగుండదు.













