మరోసారి షారుఖ్‌తో అట్లీ!
దేశంలోనే సక్సెస్ఫుల్ డైరెక్టర్లలో ఒకడిగా క్రేజ్ సంపాదించుకున్న అట్లీ తన మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన 4 సినిమాలు కూడా బ్లాక్ బస్టర్లు చేసి తన సత్తా చాటుకున్నాడు. అట్లీ దర్శకత్వంలో రీసెంట్గా వచ్చిన బాలీవుడ్ మూవీ జవాన్ వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి భారీ బ్లాక్ బస్టర్ ను అందుకుంది.
దీంతో అట్లీ తర్వాత ఏ హీరోతో సినిమా చేస్తాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అన్ని భాషల్లోని టాప్ హీరోలు అట్లీతో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నప్పటికీ వారికి వేరే కమిట్మెంట్స్ ఉండటం వల్ల వెంటనే అట్లీతో సినిమా జట్టు కట్టడానికి ఛాన్సులు లేవు. అందుకే మళ్ళీ షారుఖ్ తోనే సినిమా చేయడానికి అట్లీ రెడీ అవుతున్నాడటని తెలుస్తోంది.జవాన్ సినిమాతో తనకు ఎంతో పెద్ద హిట్ ఇచ్చిన అట్లీతో మరో సినిమా చేయాలని షారుఖ్ కూడా అనుకుంటున్నాడట. తన రెడ్ చిల్లీస్ బ్యానర్లోనే ఈ సినిమా కూడా తెరకెక్కనుందని తెలుస్తోంది.
ప్రస్తుతం అట్లీ ఈ సినిమాకు కథను రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోసారి జవాన్ కాంబోలో సినిమా రావడం పక్కా అని, నెక్ట్స్ ఇయర్ ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి.













