బన్నీ కోసం అట్లీ ప్లాన్స్
ప్రస్తుతం పుష్ప2 షూటింగ్ ను పూర్తి చేసే పనిలో నిమగ్నమైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తర్వాతి సినిమాను ఎవరితో చేయనున్నాడనేది ఆసక్తికరంగా మారింది. అఫీషియల్ గా అనౌన్స్ కాకపోయినా డైరెక్టర్ అట్లీకే బన్నీ తన ఓటేశాడని సన్నిహిత వర్గాలంటున్నాయి. రీసెంట్ గా ఇద్దరి మధ్య స్టోరీ డిస్కషన్స్ కూడా జరిగాయని, ఫైనల్ వెర్షన్ పట్ల బన్నీ అసంతృప్తిగా ఉండటంతో టీమ్ తో కలిసి అట్లీ మరోసారి వర్క్ చేస్తున్నాడట.
విజయ్, షారుఖ్ తో ప్లాన్ చేసుకున్న మల్టీస్టారర్ ఇప్పట్లో వీలయ్యే ఛాన్స్ లేకపోవడంతో అట్లీ, బన్నీ ప్రాజెక్ట్ పై సీరియస్ గా ఉన్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన క్యాస్టింగ్ గురించి కూడా అట్లీ ప్రణాళికలు వేస్తున్నాడని సమాచారం. హీరోయిన్స్ లో ఒకరిగా సమంతాను తీసుకోవాలని అట్లీ అనుకుంటున్నాడట.
ఇప్పటికే గతంలో అల్లు అర్జున్, సమంత కలిసి సన్నాఫ్ సత్యమూర్తి చేశారు. పుష్ప1లో ఓ స్పెషల్ సాంగ్ లో బన్నీతో కలిసి కాలు కదిపింది సమంత. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో మళ్లీ సినిమా వస్తుందంటే క్రేజ్ తప్పకుండా ఉంటుంది. మొత్తం ఫైనలవడానికి మరో రెండు నెలలు పట్టొచ్చు. అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేయాలని చూస్తున్నారట. బన్నీ కూడా దానికి ఓకే అన్నాడని టాక్. ఇప్పటికే పుష్ప2 కోసం నాలుగేళ్లు టైమ్ తీసుకున్న బన్నీ ఇకపై సినిమాల వేగం పెంచాలని చూస్తున్నాడట. అట్లీ సినిమా అవగానే త్రివిక్రమ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లాలనుకుంటున్నాడట బన్నీ.













