క్రీడాకారిణి గుత్తా జ్వాలా, కోలీవుడ్ స్టార్ హీరో విష్ణు విశాల్, నిరాడంబరంగా రెండో పెళ్లి
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా, తమిళ స్టార్ హీరో విష్ణు విశాల్, ఈ రోజు వివాహ బంధంతో ఒక్కటయ్యినట్లు గురువారం నాడు ఏప్రిల్ 22న సోషల్‌మీడియా ద్వారా వీరు ప్రకటించారు. తమిళంలో సూపర్ హిట్ సాధించిన ‘రాట్ససన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు అయ్యాడు హీరో విష్ణు విశాల్. గత కొంతకాలంగా విశాల్ ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలాతో చాలాకాలంగా డేటింగ్లో ఉన్నాడు. త్వరలోనే వీరిద్దరి వివాహ బంధంతో ఒక్కటవుతున్నట్లు సోషల్‌మీడియా ద్వారా ప్రకటించారు. విశాల్ తన మొదటి భార్య, దర్శకురాలు రాజినీ నటరాజ్‌ను 2010లో వివాహం చేసుకున్నాడు. అయితే వ్యక్తిగత విబేధాల కారణంగా వీరిద్దరు 2018లో విడిపోయారు. వీరిద్దరికి ఆర్యన్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. మరోవైపు జ్వాలా కూడా 2005లో చేతన్ ఆనంద్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. అతను కూడా బ్యాడ్మింటన్ క్రీడాకారుడే. అయితే వీరిద్దరు 2011లో విడిపోయారు. ఆ తర్వాత తన సోదరి పెళ్లి వేడుకల్లో గుత్తా జ్వాలాను కలిసిన విశాల్. ఆమెతో ప్రేమలో పడ్డాడు. గత ఏడాది సెప్టెంబర్‌లో వీరిద్దరు గుట్టుచప్పుడు కాకుండా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. అయితే ఈ రోజు 22వ తేదీన కుటుంబసభ్యులు, మిత్రుల సమక్షంలో తమ వివాహం జరిగిందని పేర్కొన్నారు. . ‘జీవితం ఒక ప్రయాణమని.. నమ్మకంతో ముందుకు సాగాలి’ అంటూ తమ వివాహ పత్రికను షేర్ చేశాడు అతను. అయితే కరోనా విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో తమ వివాహానికి ఎక్కువ మందిని ఆహ్వానించలేదని స్పష్టం చేశాడు.













