అశ్వథ్థామ సక్సెస్ మీట్…
సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బాగుందంటున్నారు. పాజిటివ్ మౌత్‌టాక్ వ్ల సినిమా మరింత మందికి చేరువైంది. నాతో ఉత్తమ చిత్రాన్ని తీసినందుకు అమ్మకు కృతజ్ఞతు అన్నారు నాగశౌర్య. ఆయన కథానాయకుడిగా నటించిన అశ్వథ్థామ చిత్రం ఇటీవలే ప్రేక్షకు ముందుకొచ్చింది. రమణతేజ దర్శకుడు. ఉషా మ్పుూరి నిర్మాత. హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ శౌర్య కెరీర్‌లోని భారీ ప్రారంభ వసూళ్లు సాధించిన చిత్రమిది. శౌర్య నటన, పోరాట ఘట్టాల్లో కనబరచిన కొత్తదనం బాగుందని ప్రశంసిస్తున్నారు. మున్ముందు మా సంస్థలో మరిన్ని మంచి సినిమాు అందిస్తాం అన్నారు.
నాగశౌర్యను కొత్త కోణంలో ప్రజెంట్ చేసిన సినిమా ఇదని అందరూ చెబుతుంటే ఆనందంగా ఉంది. నా తొలి చిత్రం ఈ స్థాయి విజయాన్ని సొంతం చేసుకోవడం ఆనందంగా ఉంది అని దర్శకుడు తెలిపారు. లైన్ ప్రొడ్యూసర్ బుజ్జి మాట్లాడుతూ కథలోని వైవిధ్యం, నాగశౌర్య పర్ఫార్మెన్స్ బాగుందని అందరూ మెచ్చుకుంటున్నారు. శౌర్య కెరీర్లో ఇదొక మైురాయిలా చెప్పవచ్చు అన్నారు. నాగశౌర్య అందించిన కథ నన్ను ఆశ్యర్యానికి గురి చేసింది. సున్నితమైన సబ్జెక్ట్‌ను చక్కటి స్క్రీన్‌ప్లే దర్శకుడు అద్భుతంగా డీల్ చేశాడు. ఈ సినిమాతో నాగశౌర్య యాక్షన్ హీరోగా ఎదిగాడు అని శరత్ మరార్ చెప్పారు.













