Aswath Marimuthu: మహేష్ ను డైరెక్ట్ చేయాలంటున్న తమిళ డైరెక్టర్
ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) హీరోగా అశ్వత్ మారిముత్తు(Aswath marimuthu) దర్శకత్వంలో తెరకెక్కిన డ్రాగన్(Dragon) ఈ నెల 21న రిలీజ్ కానుంది. ఈ సినిమా డైరెక్టర్ అశ్వత్ రీసెంట్ గా సినీ ప్రమోషన్స్ లో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh Babu) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
2020లో తన ట్విట్టర్ కు ఎప్పుడూ లేనంతగా భారీ వ్యూస్ వచ్చాయని, ఒక్కసారిగా ఏమైందో తనకు అర్థం కాలేదని, కాసేపటికి తనకి అసలు విషయం అర్థమైందని, తాను తీసిన ఓహ్ మై కడవులే(Oh my Kadavule) గురించి మహేష్ బాబు ట్వీట్ చేశారని, అందుకే తన అకౌంట్ అంత ఫేమస్ అయిందని తెలిసిందని తెలిపాడు.
ఓహ్ మై కడవులే చాలా చిన్న మూవీ అని, జస్ట్ రూ.3 కోట్లతోనే ఆ మూవీని తీశామని చెప్పిన అశ్వత్, ఆ సినిమా గురించి మహేష్ ను అడక్కుండానే ఆయన ఆ పోస్ట్ చేశారని, ఆ పోస్ట్ లో మహేష్ తనను ప్రశంసించాడని, మహేస్ పోస్ట్ చేసిన తర్వాత చాలా మంది తెలుగు డైరెక్టర్లు, నటీనటులు ఆ సినిమాను చూసి టీమ్ ను అభినందించినట్టు చెప్పుకొచ్చాడు. మహేష్ ఆ పోస్ట్ చేసినప్పటి నుంచి ఒక్క ఛాన్స్ ఇస్తే అతన్ని డైరెక్ట్ చేయాలని అనుకుంటున్నట్టు అశ్వత్ తన మనసులోని కోరికను బయటపెట్టాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ రాజమౌళి(rajamouli) దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.













