Saif Ali Khan: ఆర్యన్ డెబ్యూ సిరీస్ లో సైఫ్ కూతురు, కొడుకు
షారుఖ్ ఖాన్(Shah rukh Khan) కొడుకు ఆర్యన్ ఖాన్(Aaryan Khan) హీరోగా కాకుండా డైరెక్టర్ గా డెబ్యూ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆర్యన్ ఖాన్ తన డెబ్యూని సినిమాతో కాకుండా వెబ్ సిరీస్ తో చేస్తున్నాడు. బా***డ్స్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సిరీస్ లో బాలీవుడ్ కు చెందిన పలువురు స్టార్లు గెస్ట్ రోల్స్ చేస్తుండటంతో దీనిపై మంచి క్రేజ్ నెలకొంది.
షారుఖ్ ఖాన్, రణ్బీర్ కపూర్(Ranbir Kapoor), రణ్వీర్ సింగ్(Ranvir Singh), ఆలియా భట్(Alia Bhatt) తో పాటూ మరో స్టార్ హీరో సంతానం కూడా ఈ సిరీస్ లో భాగం కానున్నట్టు తెలుస్తోంది. సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) కూతురు సారా అలీఖాన్(Sara Ali Khan), కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్(Ibrahim Ali Khan) కూడా ఈ సిరీస్ లో కనిపించనున్నట్టు సైఫ్ రీసెంట్ గా వేవ్స్2025 సమ్మిట్ లో వెల్లడించాడు. నెట్ఫ్లిక్స్(Netflix) సీఈఓ టెడ్ సరండోస్(Ted Sarandose) తో సైఫ్ మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపాడు.
అంతేకాదు, తాను ఆల్రెడీ ఈ సిరీస్ ప్రివ్యూ చూశానని, సరీస్ ఎంతో అద్భుతంగా ఉందని సైఫ్ పేర్కొన్నాడు. ఈ సిరీస్ లో సారా, ఇబ్రహీం కొంతసేపు కనిపించనున్నారని వెల్లడించాడు. ఒక సాధారణ వ్యక్తి అతని ఫ్రెండ్స్ కలిసి బాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నంగా ఈ సిరీస్ ను ఆర్యన్ తెరకెక్కిస్తున్నాడు. ఈ ఏడాదే నెట్ఫ్లిక్స్ లో ఈ సిరీస్ రిలీజ్ కానుంది.






