జైలు నుంచి విడుదలైన ఆర్యన్ ఖాన్
బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ జైలు నుంచి విడుదలయ్యాడు. క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ ఈ నెల 2న ఎన్సీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఆర్యన్ ఖాన్‌తో పాటు మరికొంత మంది కూడా అప్పట్లో అదుపులోకి తీసుకున్నారు. ఎన్సీబీ అధికారులు విచారణ అనంతరం ఈ నెల 8న ఆర్యన్ జైలుకు వెళ్లాడు. ఈ నెల 28న బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆర్యన్‌తో పాటు మరో ఇద్దరు నిందితులు ఆర్బార్ మర్చంట్, మున్మున్ ధమేచాలకు కూడా బెయిల్ లభించింది. అనంతరం నిందితుల విడుదలకు సంబంధించి ఆర్థర్ రోడ్ జైలు అధికారులకు హైకోర్టు ఆర్డర్ పాస్ చేసింది. కోర్టు నుంచి ఆర్డర్స్ అందగానే సంబంధిత ప్రాసీజర్ను పూర్తి చేసి ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచాలను జైలు నుంచి విడుదల చేశారు.













