Allu Arjun: తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ ఎందుకు రాలేదో చెప్పిన అరవింద్
నాగచైతన్య(Naga chaitanya), సాయి పల్లవి(Sai Pallavi) హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన తండేల్(Thandel) ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. శ్రీకాకుళంలోని మత్య్సకారుల జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా డైరెక్టర్ చందూ మొండేటి(Chandoo Mondeti) ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గత రాత్రి హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగింది.
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్(Thandel Pre Release Event) కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) చీఫ్ గెస్టుగా రానున్నాడని మేకర్స్ ముందు నుంచే చెప్తూ వస్తుండగా, సంధ్య థియేటర్ దుర్ఘటన తర్వాత బన్నీ అటెంట్ కానున్న మొదటి సినిమా ఈవెంట్ కావడంతో బన్నీ ఈ ఈవెంట్ లో ఏం మాట్లాడతాడా అని అందరూ ఎంతగానో వెయిట్ చేశారు. తీరా చూస్తే బన్నీ ఈ ఈవెంట్ కు హాజరవలేదు.
దానికి కారణాన్ని అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్(Allu Aravind) తెలిపాడు. బన్నీ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రావాల్సిందని, కానీ తను ఫారిన్ వెళ్లి రావడం వల్ల గాస్ట్రైటిస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నాడని, అందుకే రాలేకపోతున్నట్టు తన మాటగా ఆడియన్స్ కు చెప్పమని బన్నీ అన్నాడని అరవింద్ చెప్పాడు. అప్పటివరకు బన్నీ(Bunny) వస్తాడని వెయిట్ చేసిన ఆయన ఫ్యాన్స్ బన్నీ రాకపోవడంతో నిరాశ చెందారు.













